KCR Medigadda : మేడిగ‌డ్డ డిజైన్ చేసింది కేసీఆరే

మంత్రి స‌మీక్ష‌లో నిర్మాణ సంస్థ

KCR Medigadda : హైద‌రాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీర‌డంతో ప్రాజెక్టుల డొల్ల‌త‌నం ఒక్కటొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. నీటి పారుద‌ల శాఖ‌లో ఏం జ‌రుగుతుందోన‌నే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ మేర‌కు ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌చివాల‌యంలో రివ్యూ చేశారు.

KCR Medigadda Designer

మేడిగ‌డ్డ కుంగుబాటుపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ చేసిన సంస్థ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రు డిజైన్ చేశారంటూ ఫైర్ అయ్యారు. స‌మీక్ష‌లో దేనికీ క‌రెక్టుగా స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌మిలిన‌ట్లు స‌మాచారం.

బ్యారేజీ నిర్మాణం మాత్ర‌మే తాము చేప‌ట్టామ‌ని, డిజైన్ గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. మేడిగ‌డ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి డిజైన్ చేసింది మాజీ సీఎం కేసీఆరేన‌ని(KCR) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ పాపం ఆయ‌న‌దేన‌ని త‌మ‌ది కాద‌ని పేర్కొంది.

డిజైన్ కు అనుమ‌తి కూడా లేద‌ని పేర్కొన‌డం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 21న కుంగితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. దీంతో ప‌రిస్థితి అంత ఆశాజ‌నకంగా లేక పోవ‌డంతో వెంట‌నే నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు.

Also Read : Congress Slams : కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!