CP Srinivas Reddy : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
స్పష్టం చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
CP Srinivas Reddy : హైదరాబాద్ – కొత్త సంవత్సరానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. దీంతో సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్(Hyderabad) నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇందులో భాగంగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంక్షలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీపీ .
CP Srinivas Reddy Comment
హైదరాబాద్ లోని పబ్ లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని లేకపోతే చర్యలు తప్పవన్నారు. ఒకవేళ తాము చెప్పిన విధంగా కాకుండా ఏమైనా గీత దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని వెల్లడించారు.
ప్రతి ఈవెంట్ లోనూ సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అంతే కాకుండా ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ, ట్రాఫిక్ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. పబ్బుల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు చెప్పారు సీపీ. కెపాసిటీకి మించి పాస్ లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి సరఫరాపై పూర్తిగా నిషేధం విధించినట్లు తెలిపారు.
Also Read : Mitchell Pat Commins : మిచెల్..ప్యాట్ కమిన్స్ వైరల్