Election Commission : ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం

బ‌దిలీల‌పై కీల‌క ఆదేశం

Election Commission : న్యూఢిల్లీ – త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం పూర్తిగా దృష్టి సారించింది. తాజాగా 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ముగిశాయి. కొత్త ప్ర‌భుత్వాలు కొలువు తీరాయి. తెలంగాణ‌, మిజోరం, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో మూడు రాష్ట్రాల‌లో బీజేపీ కొలువు తీరంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ, మిజోరంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.

Election Commission Shocking Decision

ఈ త‌రుణంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 2024లో లోక్ స‌భ‌, రాష్ట్ర అసెంబ్లీల‌కు జ‌ర‌గ‌నున్న నాలుగు రాష్ట్రాల్లో బ‌దిలీల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల‌లో సీనియ‌ర్ ఐఏఎస్ లు, జూనియ‌ర్ ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బ‌దిలీల‌పై ఆంక్ష‌లు విధించింది.

ఈ మేర‌కు ఈసీ(EC) మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారులు, చీఫ్ సెక్ర‌ట‌రీల‌కు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

Also Read : Revanth Reddy : సాగు నీటి రంగం లెక్క‌లు తేల్చండి

Leave A Reply

Your Email Id will not be published!