Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎంకు ఈడీ సమన్లు జారీ
జనవరి 3న హాజరు కావాలని ఆదేశం
Delhi CM Kejriwal : న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వచ్చే నెల జనవరి 3న తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు సమన్లు జారీ చేసినా పట్టించు కోలేదని పేర్కొంది ఈడీ.
Delhi CM Kejriwal Got Summons from ED
ఇదిలా ఉండగా తాను విపాసన ధ్యాన ప్రక్రియలో బిజీగా ఉన్నానని తాను హాజరు కాలేనంటూ పేర్కొన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఈ ప్రక్రియ ఈనెలాఖరు వరకు ఉంటుందని పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో సీఎంను చేర్చింది సీబీఐ. ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగింది.
ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ను మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇంకో ఆప్ మంత్రిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇదే సమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కూడా చేర్చింది కేసులో. ఈ కేసుకు సంబంధించి ఈడీ ముందుకు మూడుసార్లు హాజరైంది. కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ , సిసోడియాతో కలిసి వ్యాపారాలు చేపట్టారని స్పష్టం చేసింది ఈడీ.
Also Read : Covid19 : కరోనాపై ఏపీ సర్కార్ అలర్ట్