TTD Chairman : వైకుంఠ ద్వార దర్శనం సంతృప్తికరం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల పుణ్య క్షేత్రంలో భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించినట్లు తెలిపారు.
TTD Chairman Comment
ఆదివారం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉదయం 5.15 గంటల నుండే వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు చెప్పారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
స్వామి వారి కరుణ కటాక్షం ప్రతి ఒక్కరికీ అందాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు టీటీడీ(TTD) చైర్మన్. ఇదిలా ఉండగా నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాల ముందుగానే దర్శన సౌకర్యం కల్పించినట్లు స్పష్టం చేశారు.
అయితే స్లాట్ల వారీగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వ దర్శనం కోసం భక్తులను అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇక క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు టీ, కాఫీ, పాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఇక తిరుపతి లోని కౌంటర్లలో సర్వ దర్శనం కోసం టోకెన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 10 రోజులకు గాను 8 లక్షల మందికి టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం ఏశారు.
Also Read : Swarna Ratham : ఘనంగా స్వర్ణ రథోత్సవం