TS Ration Cards : రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్
28 నుంచి ముహూర్తం ప్రారంభం
TS Ration Cards : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాలకు తీపి కబురు చెప్పింది . ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు పథకాలను తొలి రోజే అమలుకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఒకటి మహాలక్ష్మి పథకం.
TS Ration Cards Updates
ఈ స్కీం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆరోగ్య శ్రీ కింద ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 5 లక్షల సాయాన్ని మరో రూ. 5 లక్షలు జత చేసింది. ఈ మేరకు రూ. 10 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది.
ఈ రెండు పథకాలను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా రేషన్ కార్డులను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈనెల 28న ముహూర్తం ఖరారు చేశారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
క్షేత్ర స్థాయిలో దరఖాస్తు చేసుకున్న అనంతరం పరిశీలించనున్నారు. ఆ తర్వాత సమర్పించిన పత్రాలు సరిగా ఉన్నాయో లేవోనని సరి చూసుకుని ఆ తర్వాత రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. గ్రామాల్లో, నగరాల్లో సభలు నిర్వహిస్తారు. రేషన్ తో పాటు ఆరోగ్య శ్రీ కూడా వర్తింప చేయనున్నారు.
Also Read : TTD Chairman : వైకుంఠ ద్వార దర్శనం సంతృప్తికరం