Telangana Ministers : ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు
నియమించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
Telangana Ministers : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పాలనా పరంగా పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రికంగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో పది ఏళ్ల తర్వాత పవర్ లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ(Congress). తను ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఒక రకంగా ఓ వైపు పాలన మరో వైపు లోక్ సభ ఎన్నికలు రేవంత్ రెడ్డికి సవాల్ గా మారనున్నాయి.
Telangana Ministers Details
ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు ఉన్నాయి. ఎలాగైనా సరే అత్యధిక సీట్లను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడి నుంచే ఏదో ఒక చోట సోనియా గాంధీని నిలబెట్టాలని ఇప్పటికే పార్టీ పరంగా తీర్మానం కూడా చేశారు.
దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇందుకు గాను ఉమ్మడి జిల్లాలకు ఇన్ చార్జ్ మంత్రులను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వీరికి పూర్తి పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ చార్జ్ మంత్రిగా ఉంటారు. పాలమూరు జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ఖమ్మం జిల్లాకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.
రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లాకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు దాసరి సీతక్క, నల్లగొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావును నియమించారు రేవంత్ రెడ్డి.
Also Read : Chandra Babu Naidu : ప్రజా ధనం జగన్ ప్రచారం