Chandra Babu Lokesh Pawan : ఏసు ప్రభువు దయామయుడు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
Chandra Babu Lokesh Pawan : అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ. ఎక్కడ చూసినా క్రిష్టియన్ సోదర సోదరీమణులు సంబురాలలో మునిగి పోయారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
Chandra Babu Lokesh Pawan Comment
ఇదిలా ఉండగా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపిన వారిలో సీఎంలు, గవర్నర్లు కూడా ఉన్నారు. క్రిష్టియన్లకు మంచి జరగాలని కోరారు సీఎంలు పినరయ్ విజయన్ , జగన్ మోహన్ రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డి, ఎంకే స్టాలిన్, భగవంత్ మాన్ , సిద్దరామయ్య, అరవింద్ కేజ్రీవాల్ , మమతా బెనర్జీ ఉన్నారు.
ఇదిలా ఉండగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో(Chandra Babu) పాటు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు సైతం ఏసు క్రీస్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రేమ, కరుణ, సహనం ప్రతీ ఒక్కరిలో పెంపొందించాలని పేర్కొన్నారు.
కరుణామయుడైన క్రీస్తు మనకు అందించిన శాంతి సందేశం సమాజానికి పంచి ప్రపంచ శాంతికి దోహద పడాలని సూచించారు. క్రీస్తు చూపిన మార్గమైన దయ, త్యాగ గుణం ప్రతీ ఒక్కరూ అలవర్చున్నప్పుడే జీవితం సంతోష మయం అవుతుందన్నారు. క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : TTD Tokens : 7 లక్షల టోకెన్లు జారీ – టీటీడీ