Telangana Ministers : 29న మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన
ముహూర్తం ఖరారు చేసిన సర్కార్
Telangana Ministers : హైదరాబాద్ – మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగి పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కసరత్తు ప్రారంభించింది తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎవరైనా సరే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో భాగంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎం సమక్షంలో సమీక్ష చేపట్టారు.
Telangana Ministers will Visit Medigadda
మేడిగడ్డ , అన్నారం బ్యారేజ్ లపై సీరియస్ అయ్యారు. ఈమేరకు వాస్తవ పరిస్థితులను తెలుసు కునేందుకు గాను ఈనెల 29న మేడిగడ్డను పరిశీలించాలని నిర్ణయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Uttam Kumare Reddy) పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కేసీఆర్ సర్కార్ రూ. 1,20,000 కోట్లతో నిర్మించింది. మెఘా కృష్ణా రెడ్డి కంపెనీ దీనిని చేపట్టింది. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
ఇక తాజాగా సమర్పించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, ఖర్చు , నష్టాల గురించి తెలియ చేయనున్నారు.
Also Read : Kothakota Srinivas Reddy : సన్ బర్న్ ఈవెంట్ పై సీపీ సీరియస్