Ponguleti Srinivas Reddy : ఖమ్మం జిల్లా – రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా సరే ఆర్థికంగా ఒడిదుడుకులు వచ్చినా సరే తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Ponguleti Srinivas Reddy Comments on Dharani
గత సర్కార్ కంటే భిన్నంగా తమ పాలన కొనసాగుతుందన్నారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వమే ప్రజల వద్దకు వస్తుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఉన్నా కూడా వారి వద్దకు తాము వెళతామని ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు.
వారి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). ప్రభుత్వ భూములను అప్పనంగా కొల్లగొట్టేందుకే ధరణిని తీసుకు వచ్చారని ఆరోపించారు. వేలాది ఎకరాలు కబ్జాకు గురి చేశారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాలు, భూములను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా విద్యుత్ ను ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి.
Also Read : Kunamaneni Samba Siva Rao : మేల్కోక పోతే సింగరేణి మిగలదు