CPI Ramakrishna : జగన్ రెడ్డికి రామకృష్ణ లేఖ
సమగ్ర హక్కుల పరిరక్షణ చట్టం
CPI Ramakrishna : అమరావతి – సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సమగ్ర హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించేందుకు తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna Letter to AP CM YS Jagan
అంతే కాకుండా లోప భూయిష్టమైన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -27 /2023 ను రద్దు చేయాలని కోరారు రామకృష్ణ(CPI Ramakrishna). రాష్ట్రంలో ఉన్న 535 సివిల్ కోర్టులో ఏళ్ల తరబడి భూ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 26 రెవిన్యూ ట్రిబ్యునల్ తో పరిష్కరించడం ఎలా సాధ్యమవుతుందని రామకృష్ణ ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టం రెవిన్యూ యంత్రాంగానికి వరంగా మారిందని, ఇదే సమయంలో వాస్తవ హక్కు దారులకు శాపంగా తయారైందని మండిపడ్డారు . వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని ధ్వజమెత్తారు సీపీఐ రామకృష్ణ.
ఇకనైనా ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగించడం మానుకోవాలని సూచించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు.
Also Read : Group-2 Exams Postponed : గ్రూప్-2 పరీక్షలు వాయిదా