CM Revanth Reddy : దుబారా ఖర్చులు తగ్గించండి – సీఎం
వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పండి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఇక నుంచి దుబారా ఖర్చు తగ్గించాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Comment
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో సీఎం(CM Revanth Reddy) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆయా శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన ఖర్చులు, లాభ నష్టాల గురించి సమీక్షించారు. ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మనముందు ఉన్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పాలని సూచించారు.
అసలైన తెలంగాణ ఇవాళే వచ్చిందని అనుకుని బడ్జెట్ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దుబారా చేయొద్దని, వృథా ఖర్చులు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం.
Also Read : Vijayakanth Tribute : విజయకాంత్ మృతి తీరని లోటు