Uttam Kumar Reddy : కాళేశ్వరం అవినీతిమయం – ఉత్తమ్
నీటి పారుదల శాఖ మంత్రి కామెంట్స్
Uttam Kumar Reddy : మేడిగడ్డ – తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం ..మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Uttam Kumar Reddy Comment about Kaleswaram
అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగి పోయాయని, ఈ విషయంపై ఆనాడు సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు.
విచారణకు ఆదేశించామని, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). నిజా నిజాలు ఏమిటనేది త్వరలోనే మీడియా సాక్షిగా వెల్లడిస్తామని చెప్పారు. ఏ ప్రాజెక్టు అయినా కొన్నేళ్ల పాటు ఉంటుందని , కానీ విచిత్రం ఏమిటంటే కేవలం మూడు సంవత్సరాలకే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కుంగి పోవడం దారుణమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అరెస్ట్ చేయడం ఖాయమన్నారు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలని, వారే భరించాలని డిమాండ్ చేశారు.
Also Read : Case File RGV : బర్రెలక్కపై కామెంట్స్ ఆర్జీవీపై కేసు