Virahath Ali : పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తా

టీయూడ‌బ్ల్యూజే రాష్ట్ర అధ్య‌క్షుడు విరాహ‌త్ అలీ

Virahath Ali : హైద‌రాబాద్ – టీయూడ‌బ్ల్యూజే చీఫ్ గా ఎన్నికైన విరాహ‌త్ అలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా పోరాడుతానని అన్నారు.

తనపై ఎంతో విశ్వాసంతో టీయూడబ్ల్యూజే సంఘానికి రెండు సార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జర్నలిస్టుల రుణం తీర్చుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా వెనకాడకుండా, అహర్నిశలు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తానని విరాహత్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాల సాధనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.

Virahath Ali Comment

ఇదిలా ఉండ‌గా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడిగా కే.విరాహత్ అలీ(Virahath Ali) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, యూనియన్ సభ్యుల మద్దతుతో రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్ర శేషు, సహాయ ఎన్నికల అధికారి మల్లయ్యలకు నామినేషన్ సమర్పించారు. అయితే నామినేషన్లకు డిసెంబర్ 29 చివరి రోజు కావడం, ఒకే ఒక నామినేషన్ అందడంతో విరాహత్ అలీ ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ, దొంతు రమేష్, రాష్ట్ర కార్యదర్శులు ఫైసల్ అహ్మద్, గుడిపల్లి శ్రీనివాస్, గాడిపల్లి మధుగౌడ్ లతో పాటు 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.

Also Read : Bangalore Teacher : హ‌ద్దు మీరిన పంతుల‌మ్మ‌పై వేటు

Leave A Reply

Your Email Id will not be published!