MLC Kavitha : వాహనాలను దాచాల్సిన అవసరం లేదు
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఆగ్రహం
MLC Kavitha : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. తన తండ్రిపై లేనిపోని అభాండాలు వేయడం మాను కోవాలన్నారు. ఆయన రాష్ట్రం కోసం తన ప్రాణాన్నిపణంగా పెట్టారని , కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
MLC Kavitha Comment
విచిత్రం ఏమిటంటే సీఎంకు సంబంధించిన వాహనాలు ఏవి ఉండాలో ఏవి ఉండ కూడదో భద్రతా శాఖ చూసుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం దారుణమన్నారు కల్వకుంట్ల కవిత.
సీఎం కాన్వాయ్ ప్రోటోకాల్ ను సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ , పోలీసులు నిర్ణయిస్తారని తన తండ్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కార్లు దాచు కోవాల్సిన అవసరం తమకు లేదన్నారు కవిత(MLC Kavitha). తమ కుటుంబ సభ్యులకు ఎనలేని కార్లు ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉండగా తాను ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో తన చేతికి ఉన్న వాచ్ ఖరీదు 19 లక్షలకు పైగానే ఉంటుందన్నారు కవిత. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Bhatti Vikramarka : అప్పుల కుప్పగా మారిన తెలంగాణ