108 104 Employees Strike: ఏపిలో సమ్మెకు సిద్ధమవుతోన్న 108, 104 సిబ్బంది ?
ఏపిలో సమ్మెకు సిద్ధమవుతోన్న 108, 104 సిబ్బంది ?
108 104 Employees Strike: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వానికి ఉద్యోగుల నుండి నిరసన సెగ తగులుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 28 రోజులుగా సమ్మె చేపడుతున్నారు. అంగన్వాడీల సమ్మెను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం… వెంటనే సమ్మెను విరమించాలని లేనిపక్షంలో జనవరి 8 నుండి ఎస్మా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా రోడ్డెక్కి నిరసన, ప్రదర్శనలు చేపడుతున్నారు. తాజాగా 108,104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న సిబ్బంది కూడా సమ్మె సైరన్ మోగించడానికి సిద్ధ పడుతున్నారు.
108 104 Employees Strike Viral
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108,104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె సైరన్ మ్రోగించడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు జారీ చేసారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని 108,104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె నోటీసుల్లో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 23 నుంచి సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7వేల మంది ఉద్యోగులు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు నోటీసులు వెల్లడించారు. దీనితో ఇప్పటికే గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, సమగ్ర శిక్ష సిబ్బంది చేస్తున్న సమ్మెకు 108,104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తోడవనున్నారు.
Also Read : Minister Botcha Satyanarayana: మంత్రి బొత్సాకు అంగన్వాడీల నిరసన సెగ