New Covid-19 Vaccine: వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన బెంగళూరు ఐఐఎస్సీ సైంటిస్టులు
వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన బెంగళూరు ఐఐఎస్సీ సైంటిస్టులు
New Covid-19 Vaccine: ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ పై ధీటుగా పోరాడేందుకు కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఐఐఎస్సీ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలోని మాలిక్యులర్ బయోఫిజిక్స్ సైంటిస్టుల బృందం తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కు ఆర్‌ఎస్2 అని పేరుపెట్టారు. ఈ వ్యాక్సిన్ వేడిని తట్టుకోగలదని (heat tolerant), చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేసారు. సార్స్–కోవ్–2 (SARS-CoV-2) కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదొక సింథటిక్ యాంటీజెన్. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలతో పోలిస్తే ఆర్‌ఎస్‌ఈ టీకా మరింత ఎక్కువ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులోని ఎస్2 అని సబ్ యూనిట్ వైరస్ మ్యుటేషన్లను సమర్థంగా తట్టుకుంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని అంటున్నారు. కోవిడ్–19(Covid-19)పై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని సైంటిస్టులు అభివర్ణించారు.
New Covid-19 Vaccine Updates
ఈ సందర్భంగా IISc లోని MBU ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ మాట్లాడుతూ… “భారతదేశంలో మహమ్మారి విస్తృతంగా వ్యాపించకముందే మా బృందం వ్యాక్సిన్‌పై పని చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మాకు నిధులు మరియు సహాయాన్ని అందించింది. 2000 నుండి, మేము AIDS మరియు ఇన్ఫ్లుఎంజాకు వ్యతిరేకంగా అనేక వైరల్ వ్యాక్సిన్‌లను రూపొందించడంలో పని చేస్తున్నాము. ఇటీవల IIScలో చేరిన స్టార్టప్ కంపెనీ మైన్‌వాక్స్ సహకారంతో ప్రస్తుత RS2-ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ రూపొందించాము అని అన్నారు.
Also Read : Ganja Chocolates: హైదరాబాద్ లో వెలుగుచూసిన గంజాయి చాక్లెట్ల మాఫియా !