PM Modi : కింద పడబోయిన స్టాలిన్ ను కాపాడిన ప్రధాని మోదీ
వైరల్ అవుతున్న వీడియో
PM Modi : నడుస్తూ కింద పడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ చేయి పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా చెన్నైలోని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్నడుస్తుండగా వారి వెనక క్రీడా మంత్రి ఉదయనిధి వస్తున్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో ఉపశమనం పొందిన స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
PM Modi Saves
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికపై సీఎం స్టాలిన్(CM MK Stalin) ప్రసంగించే సమయం వచ్చింది. దాంతో వేగంగా లేచి ముందుకు నడవడం మొదలుపెట్టాడు. స్టాలిన్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ప్రధాని మోదీ వెంటనే స్టాలిన్ ఎడమ చేతిని పట్టుకుని కిందపడకుండా కాపాడారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేదికపైకి ఎక్కారు.
ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని, దేశం 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అథ్లెట్లకు అంతర్జాతీయ దృశ్యమానతను తీసుకురావాలని మరియు ప్రపంచ క్రీడా పర్యావరణ వ్యవస్థకు దేశాన్ని కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. తమిళనాడును దేశానికే క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం స్టాలిన్ అన్నారు.
Also Read : CM Revanth Reddy in London: మూసీ నది పునరుజ్జీవానికి ‘థేమ్స్’ ప్రణాళిక ?