Mumbai Airport: ఎయిర్‌ పోర్టులో వీల్‌ ఛైర్‌ లేక వృద్ధుడి మృతి !

ఎయిర్‌ పోర్టులో వీల్‌ ఛైర్‌ లేక వృద్ధుడి మృతి !

Mumbai Airport: మహారాష్ట్రలోని ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఎయిర్‌పోర్టులో(Chhatrapati Shibaji Airport) విషాదకర ఘటన చోటుచేసుకుంది. వీల్‌ ఛైర్‌ అందుబాటులో లేకపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ నుండి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న వృద్ధుడు… ఎయిర్ పోర్ట్ లో వీల్‌ ఛైర్‌ అందుబాటులో లేకపోవడంతో విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌ వద్దకు సుమారు కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఎయిర్‌ పోర్టు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ… అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Mumbai Airport Wheel Chair Issue Viral

అమెరికాలోని భారత సంతతికి చెందిన వృద్ధుడు గత సోమవారం తన భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో న్యూయార్క్‌ నుంచి ముంబయి చేరుకున్నారు. టికెట్‌ కొనుగోలు సమయంలోనే వీరిద్దరూ వీల్‌ ఛైర్‌ ప్రయాణికులుగా బుక్‌ చేసుకున్నారు. అయితే ఎయిర్‌పోర్టులో సరిపడా వీల్ చైర్లు అందుబాటులో లేకపోవడంతో… సిబ్బంది వీరికి ఒక్క వీల్ చైర్ ఇచ్చారు. దీనితో వీల్‌ ఛైర్‌ లో తన భార్యను కూర్చోబెట్టిన… ఆమె వెంట నడుచుకుంటూ వెళ్లాడు. విమానం దిగిన ప్రాంతం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచిన అతడు ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వీల్ చైర్ అందుబాటులో లేక ప్రయాణీకుడు మృతి చెందిన ఘటనపై ఎయిరిండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘‘ఇది దురదృష్టకర ఘటన. ఆ రోజు వీల్‌ ఛైర్‌ లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. చక్రాల కుర్చీని ఏర్పాటు చేసే వరకు ఎదురుచూడాలని మేం ఆ ప్రయాణికుడికి చెప్పాం. కానీ, ఆయన తన భార్య వెంటే నడుచుకుంటూ వెళ్తానని చెప్పారు. మృతుడి కుటుంబంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవసరమైన సాయం అందిస్తాం’’ అని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది. న్యూయార్క్‌ నుంచి ముంబయి చేరుకున్న ఆ విమానంలో 32 మంది వీల్‌ ఛైర్‌ కోసం బుక్‌ చేసుకున్నట్లు ఎయిర్‌ పోర్టు వర్గాలు వెల్లడించాయి. గ్రౌండ్‌ సిబ్బంది వద్ద కేవలం 15 వీల్‌ ఛైర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాయి.

Also Read : Hospital Superintendent in ACB Net: ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ !

Leave A Reply

Your Email Id will not be published!