Ayodhya : అయోధ్య రామ మందిరానికి హిందువులు వెళ్లొద్దంటూ నోరుజారిన తృణమూల్ ఎమ్మెల్యే
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి రామెందు సిన్హా పై నిప్పులు చెరిగారు
Ayodhya : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. అయితే తాజాగా రామ మందిరంపై టీఎంసీ ఎమ్మెల్యే రామేందు సిన్హా(Ramendu Sinharay) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామమందిరాన్ని అపరిశుభ్రంగా అభివర్ణించారు. అదే సమయంలో రామ మందిరంలో హిందువులను పూజలు చేసేందుకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. తారకేశ్వర్‌లో టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపింది. రామెందు సిన్హా ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రామెందు సిన్హా అనుచిత వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు.
Ayodhya Viral
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి రామెందు సిన్హా పై నిప్పులు చెరిగారు. హిందువులపై దాడులు పెరుగుతున్నాయని సువేందు అధికారి సోషల్ మీడియాలో తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యల సారాంశం ఇదేనని బీజేపీ నేత సువెందు అన్నారు. హిందువులపై దాడులు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు, టిఎంసి నాయకుల ధైర్యం ఎంతగా పెరిగిపోయిందంటే, శ్రీరామ మందిరాన్ని ‘అపవిత్రం’ అనడానికి కూడా వారికి ధైర్యం వచ్చింది. హిందువులపై దాడులు చేసే ధైర్యం రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
రామ మందిరం అపరిశుభ్రంగా ఉందని తారకేశ్వర్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ వ్యాఖ్యానించారు. భారతదేశంలోని హిందువులు అటువంటి అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉన్న దేవాలయాలలో దేవుణ్ణి పూజించకూడదని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు శ్రీరామునిపట్ల టీఎంసీ నాయకత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయి. TMC ఎమ్మెల్యే ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నామని అధికారి తెలిపారు. రామేందు సిన్హా అలంబాగ్ ఆర్గనైజ్డ్ ఏరియా TMC అధ్యక్షుడు కూడా.
Also Read : TDP-Janasena : నేడు గుంటూరులో టీడీపీ-జనసేన అధినేతల సమక్షంలో జయహో బీసీ సభ