Rajiv Ratan: అశ్రునయనాలతో రాజీవ్ రతన్ కు తుదివీడ్కోలు ! పాడె మోసిన సీనియర్ ఐపీఎస్ లు !
అశ్రునయనాలతో రాజీవ్ రతన్ కు తుదివీడ్కోలు ! పాడె మోసిన సీనియర్ ఐపీఎస్ లు !
అశ్రునయనాలతో రాజీవ్ రతన్ కు తుదివీడ్కోలు ! పాడె మోసిన సీనియర్ ఐపీఎస్ లు !
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ కు కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు అశ్రునయనాల మధ్య తుదివీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మహాప్రస్థానంలో బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు నివాళులర్పించారు. కుమారుడు హరి తండ్రి పార్థివదేహానికి తలకొరివి పెట్టారు. అంతకుముందు అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరుకున్నాక డీజీపీలు రవిగుప్తా, సీవీ ఆనంద్, టీఎస్‌న్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు పాడె మోశారు. మాజీ డీజీపీలు మహేందర్‌రెడ్డి, ఆర్.పి.ఠాకూర్, గోవింద్‌సింగ్, పలువురు సీనియర్ ఐపీఎస్, విశ్రాంత అధికారులు నివాళులర్పించారు. అంతకుమునుపు మహేశ్వరం మండలం తుమ్మలూరులోని ఆయన నివాసం వద్ద పార్థివదేహానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నివాళులర్పించారు.
సీనియర్ ఐపీఎస్, బ్యాచ్‌మేట్ రాజీవ్‌రతన్ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని డీజీపీ రవిగుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్‌తో తనకున్న అనుబంధాన్ని ఐపీఎస్ ల వాట్సప్ గ్రూప్ లో పంచుకున్నారు. ‘రాజీవ్ కేవలం సహోద్యోగి లేదా స్నేహితుడు మాత్రమే కాదు. ఒక మహోన్నత వ్యక్తిత్వం గలవారు. తాను సరైనది అని ఒకసారి నమ్మితే చాలు ఎన్నడూ రాజీ పడలేదు. రాజీవ్ జ్ఞాపకాలు మా హృదయాల్లో నిలిచి ఉంటాయి,’ అని ఆయన పేర్కొన్నారు.