Simrat Kour Interview : సిమ్రాత్ కౌర్ ప్ర‌త్యేక ఇంటర్వ్యూ

Simrat Kour Interview :ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం లో యూత్‌ని హాట్ హాట్ సీన్ల‌తో అరించేందుకు వ‌స్తున్న బోల్డ్ అటెంప్ట్ చిత్రం “డర్టీ హరి”.

Simrat Kour Interview: ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం లో యూత్‌ని హాట్ హాట్ సీన్ల‌తో అరించేందుకు వ‌స్తున్న బోల్డ్ అటెంప్ట్ చిత్రం “డర్టీ హరి”. డిసెంబర్ 18న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ యాప్ ఫ్రైడే మూవీస్ లో విడుదల కానుంది ఈ సంద‌ర్భంగా ఈ చి్ర‌తిలో క‌థానాయిక‌గా న‌టించిన సిమ్రాత్ కౌర్ ప్ర‌త్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాల‌న్నీ ఆమె మాట‌ల్లోనే…

మీ తొలి చిత్రం ఏది ? డ‌ర్టీ హ‌రి సినిమాలో మీ పాత్ర ఎలాంటిదో వివ‌రించండి…
నేను చేసిన మొదటి సినిమా “ప్రేమతో మీ కార్తీక్” లో పూర్తిగా ఫ్యామిలీ అమ్మాయి రోల్ లో కనిపించా కానీ డ‌ర్టీ హ‌రిలో అందుకు పూర్తి భిన్నంగా చాలా కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ గా ఉండే జాస్మిన్ పాత్ర‌. వ్య‌క్తిగ‌తంగానూ నా జీవితానికి హ‌త్తుకునే పాత్ర అనే చెప్పాలి. .

జ‌స్మిన్ పాత్ర కోసం మీమ్మ‌ల్ని రాజుగారు ఎలా ఒప్పించారు.
రాజుగారి నుంచి నేను ముంబైలో ఉన్నప్పుడు ఓ కాల్ వ‌చ్చింది. త‌న తొలి చిత్రం చూసాన‌ని, త‌న కొత్త సినిమాకి నువ్వే హీరోయిన్ అన‌గానే డౌటొచ్చింది. ఎవ‌రో ఆట‌ప‌ట్టిస్తున్నార‌నుకున్నా. మ‌ళ్లీ కాల్ చేసి త‌న పేరు ఎం ఎస్ రాజు అని త‌న పేరుతో ఒక గూగుల్ సెర్చ్ చేసి కాల్ చేయ‌మ‌న్నారు. ఏమో అనిపించి కాసేపు గూగుల్‌లో వెతికా, వ‌ర్షం లాంటి సినిమా ప్ర‌భాస్‌తో తీస‌ని నిర్మాత ద‌ర్శ‌కుడు నాకు కాల్ చేసారా? అని న‌మ్మ‌లేక పోయా. వెంట‌నే ఆయ‌న‌కి కాల్ చేసా. హైదరాబాద్ వ‌స్తే అన్నీ వివ‌రంగా మాట్లాడుకుందామ‌ని చెప్పారు. అంతే ఆఘ‌మేఘాల మీద‌ర ఇక్క‌డికి స్తే, రాజుగారు స్క్రిప్ట్ వినిపించారు. అదేదో సాధార‌ణ సినిమాలా అనిపించ‌లా రొటీన్ కి భిన్నంగా స‌రికొత్త అనిపించింది. దీనికి తోడు స్ర్కిప్ట్ లో జాస్మిన్ పాత్ర కోసం రాజుగారు నాకు వినిపించిన విధానం న‌చ్చింది. క‌థ‌పై, క‌థ‌నంపై ఆయ‌న‌కి చాలా ప‌ట్టుంది. న‌టిగా న‌న్ను నిరూపించుకునే పాత్ర అనిపించి వెంట‌నే ఒప్పుకున్నాను.

తొలిసినిమా విడుద‌ల కాగానే సినిమాలు చెయ్యను అని చెప్పేసిన మీరు మ‌ళ్లీ ఎందుకుఇటు వ‌చ్చారు..?

మీర‌ద‌న్న‌ది నిజ‌మే ఫ‌స్ట్ సినిమా తర్వాత ఆపేసిన నా చ‌దువు పూర్తి చేయాల‌ని భావించి ఆ నిర్ణ‌యం తీసుకున్నా. తొలి సినిమా కోసం ,పైగా పర్సనల్ లైఫ్ లో నేను చాలా ఎమోషనల్. ఏదో సాధించాల‌న్న త‌ప‌న‌తో చ‌దువు మ‌ళ్లీ ఆరంభించిన ద‌శ‌లో రాజుగారి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ టైం లో మళ్ళీ చదువా, సినిమాలా అన్న డైలమాలో ఉన్నపుడు మాకుటుంబం అండ‌గా ఉంది. అందునా ఎం ఎస్ రాజు గారు న‌న్ఉ ఒక ఏంజెల్(దేవదూత) లా చూపించ‌బోతున్నార‌నిపించింది. అందుకే తిరిగి ఇండ‌స్ట్రీకి వ‌చ్చేసా. అలా అని చ‌దువు ఆపేయ‌ను. దాని ప‌ని దానిదే…

ఇంత పెద్ద ద‌ర్శ‌క నిర్మాత ఎం ఎస్ రాజు తో క‌ల‌సి ప‌నిచేయటం ఎలా ఉంది.
ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతో హిట్లు ఇచ్చిన వ్య‌క్తి రాజుగారు. అలాంటి వ్యక్తితో సినిమా చెయ్యడం అంటే సామాన్యం కాద‌నుకుంటా. వ‌య‌సులోనూ పెద్ద‌వారు. ఏన్నో విష‌యాల‌లో అనుభ‌వం ఉన్నా ఎప్పుడూ చాలా కూల్ గా క‌నిపిస్తారు. పర్సనల్ లైఫ్ లో కూడా నాకు చాలా నేర్పించారు. ఇక ద‌ర్శ‌కుడిగా అంటారా కొన్ని ముద్దు సీన్స్ ను వివరించిన విధానం. న‌టించి చూపిన తీరు చాలా న‌చ్చింది. నాలో నటన మెరుగు ప‌రుచుకునేందుకు ఉప‌యుక్త‌మైంది.

ఇది మ‌రీ బోల్టు సినిమా, సీన్లు చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది క‌దా మ‌రి మీ అమ్మగారు ఏమన్నారు?
నాకు కొన్ని కిస్ సీన్స్ కోసం చెప్పినపుడు ఓకే అనుకున్నాను అలా మా అమ్మ అయిఏ ఒప్పకోదు అనే అనుకున్నాను, కానీ ఈరోజుల్లో ఇలాంటి సీన్స్ సాధార‌ణ‌మే. పాత్ర ప‌రంగా న‌ట‌న‌కి స్కోప్ ఉంటే, అభ్యంతరం లేదని అన్నారు.

ఇప్ప‌టికే పూర్త‌యిన సినిమా మార్చిలో విడుద‌ల చేస్తామ‌ని, ఇప్పుడే చేసేస్తున్నారు. ఎందుక‌లా?
అవును కోవిడ్ కార‌ణంగా విడుద‌ల మార్చికి ప్లాన్ చేసాం. కానీ థియేటర్స్ కు ప్రేక్ష‌కులు వ‌చ్చే ప‌రిస్ధితి రాలేదు అందుకే నిర్మాత ఏటిటి లో విడుద‌ల చేస్తున్నారు.

మీ నేప‌థ్యం చెప్పండి. ఇక‌పై ఎలాంటి సినిమాలు చేస్తారు.
నేను కరాటేలో గోల్డ్ మెడలిస్టుని అలాగే మా అమ్మానాన్నలు కూడా ఒలంపిక్ ప్లేయర్స్ స్పోర్ట్స్ రోల్ చెయ్యాలి అనుకుంటున్నాను. కొన్ని క‌ధ‌లు విన్నాను. ఇంకా ఏనిర్ణ‌యం తీసుకోలేదు. చూద్దాం. మంచి క‌థ‌, మంచి పాత్ర వ‌స్తే, తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేస్తాన‌ని అనిపిస్తోంది.

No comment allowed please