Neerabh Kumar Prasad: ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరభ్‌కుమార్ ప్రసాద్ !
ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరభ్‌కుమార్ ప్రసాద్ !
ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరభ్‌కుమార్ ప్రసాద్ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు.
చంద్రబాబు వద్ద పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది – సీఎస్ నీరభ్ కుమార్
విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక తొలి బాధ్యతగా… ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం, భారత ప్రధాని పర్యటనను పర్యవేక్షించటం వంటి కీలక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని కూడా వస్తున్నందున భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీతో చర్చించి తగు సూచనలు చేశామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నందున ప్రొటోకాల్ పరంగా వారికి కల్పించాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేక బృందాలను నియమించినట్లు సీఎస్ వివరించారు.