Dalai Lama: 89వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా దలైలామా సందేశం !

89వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా దలైలామా సందేశం !

Dalai Lama: ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా 89వ వసంతంలోనికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని… బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. శనివారం 89వ పడిలోకి అడుగు పెట్టిన ఆయన ఈ మేరకు జన్మదిన సందేశం విడుదల చేశారు.

‘‘నేను 90కి సమీపంలో ఉన్నా. కాళ్లలో చిన్న అసౌకర్యం తప్ప ఎలాంటి అనారోగ్యం లేదు. నా జన్మదినం సందర్భంగా ప్రార్థనలు చేసిన టిబెటన్లందరికీ ధన్యవాదాలు’’ అని సందేశంలో పేర్కొన్నారు. ధర్మశాలలోని మైక్లోడ్‌గంజ్‌లో జరిగిన దలైలామా(Dalai Lama) జన్మదిన వేడుకలకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ తదితరులు హాజరయ్యారు.

Dalai Lama – 22న ‘ద బుక్‌ ఆఫ్‌ కంపాషన్‌’ పుస్తకావిష్కరణ

నేటి కాలంలో కరుణ ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఇద్దరు నోబెల్‌ పురస్కార గ్రహీతలు దలైలామా, కైలాశ్‌ సత్యార్థి, రచయిత పూజా పాండేతో కలిసి ముందుకు వస్తున్నారు. వీరిద్దరూ స్వేచ్ఛ, సంతోషం, అసమానతలు, అన్యాయం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను ‘‘ద బుక్‌ ఆఫ్‌ కంపాషన్‌’’ అనే పుస్తకంలో వెల్లడించనున్నారు. జులై 22న దీన్ని విడుదల చేయనున్నట్లు ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా(పీఆర్‌హెచ్‌ఐ) తెలిపింది.

Also Read : Surat Building Collapsed: సూరత్‌ లో కుప్పకూలిన భవనం ! ఏడుకు చేరిన మృతుల సంఖ్య !

Leave A Reply

Your Email Id will not be published!