Cement Factory Accident: సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం !

సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం !

Cement Factory Accident: ఎన్టీఆర్‌ జిల్లాలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం అందింది. సీఎం కార్యాలయం జోక్యంతో బాధితులకు కంపెనీ నుంచి మెరుగైన పరిహారం దక్కింది. ప్రమాదంలో మృతి చెందిన ఆవాల వెంకటేశ్‌ కుటుంబానికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని కంపెనీ యాజమాన్యం అందజేసింది.

Cement Factory Accident….

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు(Ultratech Cement) కర్మాగారంలో ఆదివారం బాయిలర్‌ పేలడంతో బూదవాడకు చెందిన ఆవాల వెంకటేశ్ మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు బాధితులకు అందుతున్న వైద్యసాయం, పరిహారంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రమేయంతో కంపెనీ యాజమాన్యం మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందించింది. క్షతగాత్రుల కుటుంబాలకు కలెక్టర్‌ సృజన, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్(Ultratech Cement) కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటన బాధితులను రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. సోమవారం విజయవాడలోని మణిపాల్ (8 మంది), ఆంధ్రా ఆస్పత్రుల్లో (8 మంది) చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారని తెలిపారు.

మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు వెల్లడించారు. బాధితుల కుటుంబసభ్యులకు ప్రమాద సమాచారం పంపించడం జరిగిందన్నారు. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి పథకాలను కార్మికులకు సదరు సిమెంట్ ఫ్యాక్టరీ వర్తింపజేస్తున్నదీ లేనిదీ విచారించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు యాజమాన్యం, ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read : YSR 75th Birth Anniversary Celebrations: ఏపీ రాజకీయాలపై తెలంగాణా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!