YS Sharmila: వైసీపీ నేతలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !
వైసీపీ నేతలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !
YS Sharmila: తల్లికి వందనం పథకంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రాచారం చేస్తున్న వైసీపీ నాయకులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉందని ఆమె విమర్శించారు. సాక్షి పత్రికలో ‘తల్లికి వందనం’ ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని తాము అడిగిమన్నారు. అయితే బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం వైసీపీ నేతల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ నేతలకు కళ్లుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్లే అయితే తాము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలని హితవు పలికారు. ‘తల్లికి వందనం’ జీవో 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింపజేయాలని తాము డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.
YS Sharmila Comment
‘‘కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీడియా సమావేశం వల్లే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనంపై వివరణ ఇచ్చింది. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన కాంగ్రెస్ నిలబడింది. 2019 ఎన్నికల కంటే ముందు… ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తానని జగన్ చెప్పలేదా ? అప్పట్లో నాతోనే ప్రచారం చేయించారు. నేను వైసీపీ(YCP) కోసం బై బై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు రూ.15000 చొప్పున, ప్రతి తల్లికి ఇస్తామని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు రూ.15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు? మీరు కూడా ఎందుకు క్యాంయిన్ చేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం పూర్తి చేస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు క్యాంపెయిన్ చేయించారు? మీరు కూడా ఎందుకు క్యాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Also Read : Ponnam Prabhakar: త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్