Supreme Court-Neet : నీట్ పేపర్ లీకేజీ పై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

అందులో జాతీయ, రాష్ట్ర మరియు నగర స్థాయిలో మార్కుల పంపిణీని విశ్లేషించినట్లు పేర్కొంది...

Supreme Court : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో గురువారం ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పేపర్ లీకేజ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశ పరీక్ష దెబ్బతిందని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లకు వచ్చిన మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మొత్తం విద్యార్థుల్లో 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్‌ కోరుతున్నారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తున్నారని, అందుకే వాదనలను గురువారం నుంచే ప్రారంభిస్తామని కోర్టు పేర్కొంది. విచారణను శుక్రవారం వరకు కూడా కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. శుక్రవారం నుంచి విచారణను జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా, ఈ మేరకు సమాధానం సమాధానమిచ్చింది.

Supreme Court Comment..

మే 5న 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 14 విదేశీ నగరాలు కూడా ఉన్నాయి. కేంద్రం, NTA, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లలో, పరీక్షను రద్దు చేయడం సరైనది కాదని, గోప్యతా ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలు లేనప్పుడు లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులను తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది.

ఇక్కడ NTA కూడా ఇదే తరహాలో ప్రత్యేక అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో జాతీయ, రాష్ట్ర మరియు నగర స్థాయిలో మార్కుల పంపిణీని విశ్లేషించినట్లు పేర్కొంది. ఈ విశ్లేషణ స్కోర్‌ల పంపిణీ ఖచ్చితంగా సాధారణమని సూచిస్తుంది. ఇందులో మార్కుల పంపిణీని ప్రభావితం చేసేది ఏమీ లేదని వెల్లడించింది. 2024-25 అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది.

Also Read : Buddha Venkanna : విలేకరుల పై విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలు సరికాదు

Leave A Reply

Your Email Id will not be published!