MLC Kavitha Case : ఎమ్మెల్సీ కవితపై కీలక హెల్త్ అప్డేట్..10 కిలోలు తగ్గిందా..?

నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్న కవిత ఏకంగా 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం...

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. జైలు అధికారులు ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి, వైద్యం చేయించిన అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. కాగా కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్‌ కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్‌లో ఆమెను చూసి అనిల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు నిరాకరించిన కోర్టు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చింది.

MLC Kavitha Case…

నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్న కవిత(MLC Kavitha) ఏకంగా 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో నీరసంగా ఉంటున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఆమెకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర పరీక్షలు చేశారు. అనారోగ్యం, బరువు తగ్గుతుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంపట్ల ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జైలులో దోమలు ఎక్కువగా ఉండటంతో అందులోని చాలా మంది ఖైదీలకు డెంగ్యూ సోకుతోందని.. దీంతో కవిత కూడా అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీసేందుకు కేటీఆర్, హరీశ్ రావు జులై 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. కవిత ఆరోగ్యంపట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Also Read : Andhra Pradesh Government: ఏపీలో డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు !

Leave A Reply

Your Email Id will not be published!