Kargil Vijay Diwas 2024 : అగ్నిపథ్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని

ఈ ఏడాది జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి 25 ఏళ్లు అయింది.

Kargil Vijay Diwas 2024 : అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. జులై 26వ తేదీ కార్గిల్ దివాస్. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సైన్యంలో సంస్కరణల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. సైన్యంలోకి యువ రక్తాన్ని తీసుకు రావడంతోపాటు యుద్దానికి ఎల్లవేళలా సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తయారు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ సున్నితమైన అంశమని చెప్పారు. అలాంటి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు.. తమ వ్యక్తిగత లాభం కోసం అగ్నిపథ్‌ పథకాన్ని రాజకీయ అంశంగా మలుచుకున్నాయన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న ఆ యా పార్టీల్లోని వ్యక్తులు.. గతంలో సైన్యంలో వేల కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడి సైన్యాన్ని బలహీన పరిచాయని ప్రధాని మోదీ వివరించారు.

Kargil Vijay Diwas 2024…

ఈ ఏడాది జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి 25 ఏళ్లు అయింది. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లు కోసం ద్రాస్ సెక్టర్‌లోని నిర్మించిన కార్గిల్ స్మారక స్థూపం వద్ద ప్రధాని మోదీ(PM Modi) వారికి ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం దాదాపు మూడు నెలల పాటి సాగి జులై 26వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా పొరుగునున్న దాయాది దేశం పాక్‌పై మండిపడ్డారు. పాకిస్థాన్ నేటికి గుణపాఠం నేర్చుకోలేదన్నారు. అయితే ప్రధాని మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం యువతను సైన్యంలోకి తీసుకొనేందుకు అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

అంతేకాదు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లోని యువత సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు, నిరసనల బాట పట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) సైతం ఈ అగ్నిపథ్ పథకంలో మార్పు, చేర్పులు చేయాలని ప్రధాని మోదీకి విజ్జప్తి చేసిన విషయం విధితమే.

Also Read : CM Revanth : నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!