Potti Sreeramulu Telugu University: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుకు ప్రభుత్వం సన్నాహాలు !
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుకు ప్రభుత్వం సన్నాహాలు !
Potti Sreeramulu Telugu University: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి(Potti Sreeramulu Telugu University) సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తే పేరును మారుస్తామని ఆయన శాసనసభ వేదికగా ప్రకటించారు.
Potti Sreeramulu Telugu University…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… ‘సురవరం ప్రతాపరెడ్డికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. వారి అభ్యర్థన మేరకు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున నేను సురవరం పేరును ప్రతిపాదిస్తున్నాను. సభలో అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఆమోదం అయితే పేరును మారుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రతీ ఏటా నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించేవారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ కి ఆయన పేరు పెట్టారు. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో హైదరాబాద్ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా కోనసాగింది. పొట్టి శ్రీరాములు నవ్యాంధ్ర లోని నెల్లూరు జిల్లా కు చెందిన వ్యక్తి కావడంతో ఆ జిల్లా కు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ప్రకటించి పదేళ్ళు పూర్తి కావడంతో తెలంగాణ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : CM Revanth : తెలంగాణ క్రీడాకారులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్