Kharge: ఆర్టికల్ 370 రద్దు చేసి, ఐదేళ్లు పుర్తి అయింది ఇంకా ఎన్నికలు లేవు..!
ఆర్టికల్ 370 రద్దు చేసి, ఐదేళ్లు పుర్తి అయింది ఇంకా ఎన్నికలు లేవు..!
Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తద్వారా అక్కడి ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి, ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kharge Comment
‘‘ఆర్టికల్ 370 రద్దుతో ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని, తీవ్రవాదాన్ని అరికట్టే అవకాశం ఉంటుందని గతంలో మోదీ చెప్పారు. అయితే.. ప్రస్తుతం ఆయన మాటలకు భిన్నంగా జమ్ములో ఉగ్రదాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు 683 ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు’’ అని ఖర్గే పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జమ్ములో 25 ఉగ్రదాడులు జరిగాయని.. 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారని తెలిపారు.
Also Read : Chandrababu: గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు !