Organ Donation: అవయవదానంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అవయవదానంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Organ Donation: అవయవదానంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా ప్రత్యేక మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్‌ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్‌కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Organ Donation…

అదే సమయంలో జీవన్మృతుడికి సంబంధించిన భౌతికకాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని, అత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈమేరకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అంత్యక్రియలకు రూ.10వేల ఆర్ధిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని స్పష్టం చేశారు.

Also Read : mp vijayasai reddy: ఎవరు ఈ హత్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు

Leave A Reply

Your Email Id will not be published!