Doctors Strike: సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు !

సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు !

Doctors Strike: కోల్‌కతా వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఆందోళనలు(Doctors Strike) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 11 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలు విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (FAIMA) ప్రకటించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన హామీ, ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా(Kolkata) వైద్యురాలి హత్యాచార ఘటన పై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించిన ధర్మాసనం.. ఆందోళనల కారణంగా పేదలు నష్టపోకూడదని వ్యాఖ్యానించింది. వెంటనే విధుల్లో చేరాలని.. ఆందోళనలు చేపట్టిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆందోళన బాటపట్టిన వైద్యులు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తితో ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనకు విరామం పలికారు.

Doctors Strike – వైద్యుల భద్రతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

వైద్యుల భద్రతకు సంబంధించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దేశంలోని వైద్య రంగానికి చెందిన ప్రముఖులతో ఏర్పడిన ఈ కమిటీ సమావేశమై వైద్యుల భద్రతకు సంబంధించి తీసుకోవల్సిన చర్యలపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా సుప్రీంకోర్టు డాక్టర్ల సంరక్షణ విషయంలో పలు ఆదేశాలు జారీచేసే అవకాశం ఉంది. దేశంలోని వైద్యులను సంప్రదించి వారి సమస్యలను ఈ టాస్క్‌ఫోర్స్ తెలుసుకోనుంది.

Also Read : CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలను నమ్ముకొని రైతులు కంగారు పడొద్దు

Leave A Reply

Your Email Id will not be published!