Duvvada Srinivas: టెక్కలి ఇన్ చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించిన వైసీపీ అధిష్టానం !
టెక్కలి ఇన్ చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించిన వైసీపీ అధిష్టానం !
Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ గొడవలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడంతో పాటు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో… వైసీపీ అధిష్టానం నష్ట నివారణా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైకాపా అధిష్ఠానం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తొలగించి, సీనియర్ నేత పేరాడ తిలక్‌ను ఇన్ ఛార్జిగా నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Duvvada Srinivas…
ఇటీవల టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) ఇంటి వద్ద ఆయన భార్య వాణి చేపట్టిన నిరసన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ వాణి, పెద్ద కుమార్తె హైందవి బయట ఉన్న కారు షెడ్డులోనే దీక్ష చేస్తున్నారు. వైసీపీ కార్యకర్త దివ్వల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాణి ఆరోపిస్తూ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో తన ఇంటి వద్ద ధర్నా చేస్తున్న వారిపై శ్రీనివాస్ దాడికి ప్రయత్నించారు. ఇరువర్గాల ఫిర్యాదులు ఆధారంగా టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది ఇలా ఉండగా దివ్వల మాధురి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) తో తనకు సంబంధం ఉందని… అయితే వాణి చేసిన దుష్ప్రాచారం వలనే తన కుటుంబానికి దూరమై విధిలేని పరిస్థితుల్లో శ్రీనివాస్ తో సంబంధం కొనసాగిస్తున్నానని చెప్పింది. అయితే శ్రీనివాస్, వాణి, మాధురి మధ్య సంబంధం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో తన కారును ఆగిఉన్న కారును ఢీ కొట్టడం ద్వారా మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే కారులో బెలూన్లు సకాలంలో తెరచుకోవడంతో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి సమస్య పార్టీపై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు… సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన జగన్… టెక్కలి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించారు.
Also Read : Deputy CM Pawan Kalyan: ఫార్మా ప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది – డిప్యూటీ సీఎం పవన్