Railway Board: రైల్వేబోర్డు ఛైర్మన్‌గా సతీశ్‌కుమార్‌ !

రైల్వేబోర్డు ఛైర్మన్‌గా సతీశ్‌కుమార్‌ !

Railway Board: రైల్వే బోర్డు 47వ ఛైర్మన్, సీఈవోగా ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) అధికారి సతీశ్‌కుమార్‌ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రైల్వేబోర్డు చరిత్రలో సతీశ్‌కుమార్‌ తొలి దళిత ఛైర్మన్, సీఈవో కానున్నట్లు బోర్డు సీనియర్‌ అధికారులు తెలిపారు.

Railway Board New Chairman

సెప్టెంబరు 1 నుంచి సతీశ్‌ కొత్త బాధ్యతలు చేపట్టి, 2025 ఆగస్టు 31 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం రైల్వేబోర్డులో ట్రాక్షన్, రోలింగ్‌ స్టాక్‌ మెంబర్‌గా ఉన్న ఈయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 1988 మార్చిలో రైల్వేలో చేరిన సతీశ్‌కుమార్‌ ఉత్తరమధ్య రైల్వేజోన్‌ (ప్రయాగ్‌రాజ్‌) జీఎంగా గతంలో పనిచేశారు. గతేడాది సెప్టెంబరు 1న రైల్వేబోర్డు బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఛైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా పదవీకాలం ముగుస్తుండటంతో ఆ స్థానంలో సతీశ్‌ను నియమించారు.

Also Read : West Bengal Bundh: హింసాత్మకంగా మారిన బెంగాల్ బంద్ !

Leave A Reply

Your Email Id will not be published!