Pawan Kalyan – Balineni : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన మాజీ మంత్రి బాలినేని

వైసీపీలో పరిణామాలు చూస్తే ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేనట్లేనని అన్నారు...

Pawan Kalyan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డికి విశ్వసనీయత లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు. వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను గెలిపించాలని ఆనాడు రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను జగన్‌రెడ్డి మరిచిపోయారని ధ్వజమెత్తారు. సభల్లో జగన్‌ ఎప్పుడూ నా గురించి మాట్లాడలేదని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పవన్‌ కళ్యాణ్ తన గురించి మాట్లాడారని ప్రశంసించారు. తనపై పవన్‌ ఎంతో అభిమానంతో ఉన్నారని కొనియాడారు. పవన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. తనతోపాటు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలిసి జనసేనలో చేరుతారని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

Pawan Kalyan Meet..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో వైఎస్సార్సీపీ కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(Balineni Srinivasa Reddy), ఉదయభాను ప్రకటించారు. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పరిస్థితి చాలా దారుణంగా‌ ఉందని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. తన మనసుకి కష్టం కలిగింది‌ కాబట్టి పార్టీ వీడానని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఎంతో సన్నిహితంగా పని చేశానని గుర్తుచేశారు. వైఎస్ కుమారుడితో అదే కమ్మిట్‌మెంట్‌తో పనిచేశానని తెలిపారు. ఎన్నికలకు ముందు చాలాసార్లు జగన్‌ను కలిసి పార్టీ పరిస్థితి గురించి చెప్పినా పట్టించుకోలేదని సామినేని ఉదయభాను ధ్వజమెత్తారు.

వైసీపీలో పరిణామాలు చూస్తే ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేనట్లేనని అన్నారు. తమ భవిష్యత్తు తాము చూసుకోవాలనే భయటకు వచ్చామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి అన్ని‌ విషయాలు చర్చించినట్లు చెప్పారు. ఈనెల 22వ తేదీన జనసేనలో చేరుతున్నామని ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జనసేనలో చేరుతున్నారని చెప్పారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని సామినేని ఉదయభాను వెల్లడించారు.

Also Read : Minister Rama Naidu : బుడమేరు ఆక్రమణలపై చర్యలు తప్పవు

Leave A Reply

Your Email Id will not be published!