TDP MP List : మరోసారి లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీడీపీ

అయితే, టీడీపీ నేతలు మాత్రం తమ అభ్యర్థుల్లో తన సత్తాను నిరూపించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి

TDP MP List : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన మహాకూటమి అభ్యర్థులను ఖరారు చేయడంలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు గెలిచే వారికే టిక్కెట్లు ఇచ్చిన టీడీపీ తాజాగా రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్లమెంటు అభ్యర్థులను నిశితంగా పరిశీలిస్తే… ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు కొత్తవారేనని భావిస్తున్నారు. అయితే, టీడీపీ(TDP) నేతలు మాత్రం తమ అభ్యర్థుల్లో తన సత్తాను నిరూపించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నాలుగింటిలో మూడు స్థానాలు టీడీపీకి దక్కడం ఖాయమని పార్టీ అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి.

TDP MP List…

ఎంపీ అభ్యర్థులు వీరే.. విజయనగరం : కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు : మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంతపురం : అంబికా లక్ష్మీనారాయణ, కడప : భూపేష్‌రెడ్డి.

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. చీపురుపల్లి : కళా వెంకట్రావు, భీమిలి: గంటా శ్రీనివాసరావు, పాడేరు: కె. వెంకటరమేశ్‌ నాయుడు, దర్శి : గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట : సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు : వీరభద్ర గౌడ్‌, గుంతకల్లు : గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్‌ : దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, కదిరి : కందికుంట వెంకట ప్రసాద్‌‌‌లను అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

Also Read : Raghunandan Rao BJP : నన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ 4 సంవత్సరాల పెండింగ్ పనులు పూర్తి చేస్తాను

Leave A Reply

Your Email Id will not be published!