క్రైస్ట్ చర్చ్ : న్యూజిలాండ్ లో జరుగుతున్న టి20 సీరీస్ లో ఆతిథ్య జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సీరిస్ లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన కీలక తొలి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. 4 వికెట్ల తేడాతో కోలుకోలేని షాక్ తగిలేలా చేసింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, నమన్ ధీర్ రాణించడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సంజూ శాంసన్ అద్భుతమైన అర్ధశతకంతో పునాది వేయగా నమన్ ధీర్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు 4 వికెట్ల విజయాన్ని అందించారు. శాంసన్ 67 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే తను అవుట్ అయిన తర్వాత భారత్ జట్టు స్వల్ప ఒత్తిడికి లోనైంది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , నమన్ ధీర్ బాధ్యతాయుతంగా ఆడి, జట్టును విజయ తీరాలకు చేర్చారు. నమన్ ధీర్ కేవలం 15 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లతో) సాధించి, భారత్‌కు విజయాన్ని ఖాయం చేశారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
వీరిద్దరూ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ క్రమం తప్పకుండా బౌండరీలు బాదడంతో భారత్ లక్ష్య ఛేదనలో పట్టు సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించారు. పవర్‌ప్లేలో జట్టుకు పైచేయి అందించిన తను కేవలం 23 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నారు. మరోవైపు శర్మ విలువైన సహకారాన్ని అందించినప్పటికీ, పవర్‌ప్లే చివరి ఓవర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు (12 బంతుల్లో 29 పరుగులు). పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 94/1 స్కోరు వద్ద నిలిచింది. అప్పటికి క్రీజులో సంజూ శాంసన్, తిలక్ వర్మ ఉన్నారు. తొమ్మిదవ ఓవర్లో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్‌కు కీలక వికెట్‌ను అందించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ (33 బంతుల్లో 67 పరుగులు) అతని బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అతని స్థానంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. తర్వాతి ఓవర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ మరో వికెట్ తీశాడు. ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మ (11 బంతుల్లో 6 పరుగులు) అతని బౌలింగ్‌లో అవుటయ్యాడు.
