ఓట్ల చోరీకి కుట్ర ప‌న్నిన సీఈసీ జ్ఞానేష్ కుమార్

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ : ఏఐసీసీ చీఫ్, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై. . రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రవేశ పెట్టిన ప్రజా అభిశంసన తీర్మానంలో ఆరు కీలక ఆరోపణలు ప్రస్తావించారు. ఎన్నికల దొంగతనానికి కుట్ర పన్నడం. 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం. పార్లమెంట్‌కు తెలియకుండా ఫారం 6 నిబంధనలను మార్చడం.ఈసీఐ నెట్ ద్వారా ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకోవడం. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం నిరాకరించడం. ప్రధాని మోదీ, అమిత్ షాల ఆదేశాల మేరకు వ్యవహరించడాన్ని త‌ప్పు ప‌ట్టారు ఖ‌ర్గే. ఇండియా’ కూటమి నిర్వహించిన నకిలీ అభిశంసనలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై దేశద్రోహం కు పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ “బీజేపీ పన్నిన కుట్రలో” భాగస్వామి అని ఆయన ఆరోపించారు.

ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి నాయకులు నిర్వహించిన నకిలీ పార్లమెంటులో జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించే క్రమంలో ఖర్గే ఈ ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియ “పక్షపాతంతో, పారదర్శకత లేకుండా సాగిందని, ఇది పౌరుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును ఉల్లంఘించేలా ఉందని” ఆయన పేర్కొన్నారు. త విజయ్ దేవరకొండ బూతు పదం వాడారు, తాను ఎవరికీ ‘దయ లేదా గౌరవం’ ఇవ్వనని అన్నారు. పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండా 1960 ఓటర్ల నమోదు నిబంధనలలోని ఫారం 6ను కుమార్ సవరించారని, దీనివల్ల తొలిసారి ఓటు వేసేవారికి నమోదు చేసుకోవడం కష్టంగా మారిందని కూడా ఆయన ఆరోపించారు. ఓటర్ల తొలగింపును సులభతరం చేయడానికి , చట్టబద్ధమైన చేర్పులన నిరోధించడానికి, సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ల జాబితాలపై నియంత్రణను కేంద్రీకరించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఖ‌ర్గే.

అధికార బీజేపీకి అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులకు సరైన విచారణ అవకాశాన్ని నిరాకరిస్తున్నారని, ఎన్నికల కమిషన్ రాజ్యాంగ స్వాతంత్రాన్ని దెబ్బ తీస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అధికార వర్గానికి అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా కుమార్ కుటుంబ సభ్యులు కీలక పదవులు, ఆర్థిక లబ్ధి పొందే అవకాశాలతో సహా పలు ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!