సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ మూవీకి ముహూర్తం రెడీ

రంగ‌స్థ‌లం త‌ర్వాత మ‌రోసారి దిగ్గ‌జాల క‌ల‌యిక

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రాన్ని తాత్కాలికంగా దీనిని ఆర్ సీ 17 అని పిలుస్తున్నారు. ఇవాళ పూజా కార్య‌క్ర‌మానికి సిద్ద‌మైంది. 2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ , సుకుమార్ మళ్లీ కలిసి పని చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పట్ల తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవి శంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఆదివారం ఈ చిత్రం ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. చిత్ర బృందం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం సంగీత విభాగం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, సుకుమార్ , అనిరుధ్ కలిసి పనిచేసే కొత్త కలయికగా ఇది నిలుస్తుంది. గతంలో సుకుమార్ తన విజయవంతమైన చిత్రాలకు ‘రంగస్థలం’ ‘పుష్ప’ సిరీస్‌తో సహా దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి పని చేశారు. అయితే సంగీత దర్శకుడి విషయంలో చిత్ర బృందం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 2026లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమా అధికారిక పేరు, పూర్తి తారాగణం , ఇతర సాంకేతిక బృందం వివరాలను చిత్ర నిర్మాతలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Leave A Reply

Your Email Id will not be published!