జగన్ రెడ్డి తీరువల్లే శాంతి భద్రతల సమస్య

బెంగళూరులో మీడియా సమావేశంలో మంత్రి లోకేష్

బెంగళూ రు: ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన అనంతరం స్థానిక ఎన్నికలపై మంత్రి స్పందించారు. పులివెందులలో ఏకగ్రీవం జరిగాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలోని ప్రతివార్డు ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతున్నారని మండిప‌డ్డారు. గత ఎన్నికల్లో పులివెందులలో ఏవిధంగా ఏకగ్రీవం చేశారని అందరూ ప్రశ్నించాలని అన్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు నారా లోకేష్‌. ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోలీస్ సెక్యూరిటీని కల్పించడం జరిగిందన్నారు. పులివెందులలో నామినేషన్ వేసేందుకు ఎవరూ అడ్డుపడలేదని పేర్కొన్నారు. నామినేషన్ వేశారు. పులివెందులలో శాంతిభద్రతల సమస్యను సృష్టించారని ఆరోపించారు. గత రాత్రి వాహనాలను తగులబెట్టారు. నిందను మాపై వేశారు. ప్రజలపై వారే దాడి చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఎన్నికలు జరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. పులివెందులలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయ ని ప్ర‌శ్నించారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం అని ఆరోపించారు. పులివెందులలో జగన్ రెడ్డి శాంతిభద్రతల సమస్యను సృష్టించారని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు తామే బాధితులం అని చెప్పుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు. జగన్ రెడ్డి మాత్రం బెంగళూరులో ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి వచ్చి సమస్యలు సృష్టించారని పేర్కొన్నారు. అనంతరం హెలికాఫ్టర్ లో బెంగళూరు వెళ్లిపోయారని, జాతీయ మీడియాను పిలిచి శాంతిభద్రతల సమస్య అంటూ నిందలు వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

గత ఎన్నికల్లో పులివెందుల ఎందుకు ఏకగ్రీవం అయిందో ప్రజలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేశారని ఆరోపించారు. ఇప్పుడు మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాం అన్నారు. పులివెందులలో కూడా ప్రజలు వచ్చి ఓట్లు వేశారని దానిని ఓర్చుకోలేక పోతున్నార‌ని వాపోయారు.

Leave A Reply

Your Email Id will not be published!