Bishnoi Gang Threats : పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్

ఒక క్రిమినల్ జైలులో కూర్చుని సవాళ్లు విసురుతున్నాడు...

Bishnoi Gang Threats  : పూర్ణియా లోక్‌సభ ఎంపీ పప్పూ యాదవ్‌(Pappu Yadav)కు నిషేధిత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై ఆయన డీజీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టం అనుమతిస్తే 24 గంటల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్‌ను లేకుండా చేస్తానని పప్పూ యాదవ్ ఇటీవల సామాజిక మాధ్యమం “ఎక్స్”లో ట్వీట్ చేశారు. ముంబైలో ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖి హత్యానంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి ఆయనకు తాజాగా బెదిరింపులు వచ్చాయి. యాదవ్ కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండకపోతే ఆయనను కూడా చంపేస్తామని కాలర్ హెచ్చరించాడు.

Bishnoi Gang Threats MP..

”ఒక క్రిమినల్ జైలులో కూర్చుని సవాళ్లు విసురుతున్నాడు. జనాలను చంపుతుంటే ప్రతి ఒక్కరూ మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నారు. మొదట మూసేవాలా, ఆ తర్వాత కర్ణి సేన చీఫ్, ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ పొల్టీషియన్. చట్టం కనుక అనుమతిస్తే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను నేను తుదముట్టిస్తాను” అని పప్పూ యాదవ్ ఇంతకుముందు ట్వీట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో తనకు భద్రత పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పప్పూ యాదవ్ లేఖ రాశారు. తనకు ‘జడ్’ కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల కారణంగానే ఈ భద్రతను కోరుతున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతిని బీహార్ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పోలీసు అధికారులకు కూడా పంపారు.

Also Read : Raj Pakala : పోలీసు నోటీసులపై స్పందించిన కేటీఆర్ బావమరిది

Leave A Reply

Your Email Id will not be published!