Minister Seethakka : గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు చేసింది సూన్యం

డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచకపోవడంతో పిల్లలు అర్ధాకలితో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు...

Minister Seethakka : బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైందని పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క(Minister Sethakka) విమర్శలు చేశారు. విద్యా శాఖకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. అందుకే ఎన్నడు లేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ 40శాతం పెంచారని గుర్తుచేశారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క(Minister Seethakka) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు 40శాతం చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. డైట్ చార్జీలు ఏడేళ్లుగా, కాస్మోటిక్ చార్జీలు గత 16 సంవత్సరాలుగా పెరగలేదని అన్నారు. ఏడు సంవత్సరాల క్రితం డైట్ చార్జీలు కొంచెం పెంచి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని మంత్రి సీతక్క మండిపడ్డారు.

Minister Seethakka Comment

ఏడేళ్లుగా ధరలు విపరీతంగా పెరిగాయని.. అందుకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచకపోవడంతో పిల్లలు అర్ధాకలితో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి టాయిలెట్స్ కట్టలేదని..తాగునీరు, మౌలిక వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు. ఈ సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సీతక్క అన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని వివరించారు.పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకళితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. పెంచిన చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లది, హాస్టల్ సిబ్బందిది అని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Also Read : HYD Rains : భాగ్య నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

Leave A Reply

Your Email Id will not be published!