Minister Kishan Reddy : ఈ నెల 25 నుంచి వాజ్ పేయి గారి శతజయంతి వేడుకలు జరపాలి

హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు వంద పార్టీ జెండాలతో ర్యాలీ ఉంటుందని తెలిపారు...

Kishan Reddy : దివంగత ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు కొనసాగించాలని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ నాయకులతో సమావేశమైన కిషన్‌రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ, వాజ్‌పేయి జయంతి సందర్భంగా 25న పోలింగ్‌ బూత్‌స్థాయిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించాలని, మండల స్థాయిలో రక్తదాన శిబిరాలు, జిల్లా కేంద్రాల్లో వాజ్‌పేయి జీవిత చరిత్రకు సంబంధించి ఫోటో చిత్ర ప్రదర్శన నిర్వహించాలని చెప్పారు. హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు వంద పార్టీ జెండాలతో ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం రాష్ట్రపార్టీ కార్యాలయంలో ప్రముఖులతో సమావేశం, రక్తదాన శిబిరం ఉంటుందని వివరించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఈ నెల 30 లోపు పోలింగ్‌ బూత్‌, మండల స్థాయి కమిటీల నియామకాలను పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.

Minister Kishan Reddy Comments

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలు, హాస్టళ్లు విద్యాకేంద్రాలు కావని, అవి మరణకూపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 62, కాంగ్రెస్‌ ఏడాది పాలనలో 26 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. గురుకులాలలో పెరుగుతున్న మరణాలు, ఆత్మహత్యలు, ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల వెనుకబడిన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గురుకులాలలోని పరిస్థితులు కాంగ్రెస్‌ హయాంలో మరింత దిగజారాయని, ఈ నిర్లక్ష్యానికి గత, ప్రస్తుత పాలకులు బాధ్యత వహించాలన్నారు.

Also Read : MP Purandeswari : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ప్రమాదం అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదు

Leave A Reply

Your Email Id will not be published!