PM Modi-Elon Musk : కీలక అంశాలపై భారత ప్రధానితో భేటీ అయిన మస్క్
ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది...
Elon Musk : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా గడుపుతున్నారు. గురువారం, ఆయన పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో, ప్రధాని మోదీ(PM Modi) ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను కలిశారు. ఈ సమావేశంలో ఎలాన్ మస్క్‌తో పాటు ఆయన భార్య మరియు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ ఎలాన్ మస్క్‌తో భారత్‌లో టెస్లా ఎంట్రీ, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలపై చర్చలు జరిపినట్లు సమాచారం.
Elon Musk Meet PM Modi
అంతకు ముందు, అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్‌తో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. NSAతో నిర్వహించిన ఈ సమావేశం ఫలవంతమైనదని, మైక్ వాల్జ్ ఎల్లప్పుడూ భారతదేశానికి గొప్ప స్నేహితుడని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి కీలక అంశాలపై భారతదేశం-యుఎస్ఎ సంబంధాలలో గొప్ప చర్చలు జరిగాయని చెప్పారు. AI, సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాలలో సహకారానికి బలమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు.
భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2.30 గంటలకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ భేటీ జరగనుంది. మరోవైపు, సుంకాల విషయంలో ట్రంప్ కీలక ప్రకటన చేసిన సమయంలో ఇరువురు భేటీపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Manipur President’s Rule :మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన భారత సర్కార్