TTD : తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించండి – కేంద్రానికి టీటీడీ ఛైర్మన్ లేఖ
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించండి - కేంద్రానికి టీటీడీ ఛైర్మన్ లేఖ
TTD : తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. ఆగమ శాస్త్ర సూత్రాలు, ఆలయ పవిత్రత, భద్రత మరియు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
TTD Chairman Write a Letter..
‘‘తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు.. ముఖ్యంగా హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోంది. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో-ఫ్లైజోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుంది’’ అని తితిదే ఛైర్మన్ ఆ లేఖలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మెన్ రాసిన లేఖపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సానుకూలంగా స్పందించారు.
Also Read : Nadendla Manohar: వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు