Land for Job Scam Case: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్, కుమార్తె హేమకు బెయిల్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్, కుమార్తె హేమకు బెయిల్

Land for Job Scam : బీహార్ లో సంచలనం సృష్టించిన ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్(Teja Pratap Yadav), కుమార్తె హేమ యాదవ్‌, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ కావడంతో తేజ్ ప్రతాప్, హేమ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. దీనితో వీరికి కోర్టు రూ. 50,000 పూచీకత్తు, అంతే మొత్తానికి ష్యూరిటీతో కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, మిసాభారతి హాజరు కావాల్సి ఉండగా… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వీరు దరఖాస్తు చేసుకున్నారు.

Land for Job Scam Updates

ఈ కేసులో తుది ఛార్జిషీట్లుతో సహా మూడు చార్జిషీట్లను సీబీఐ దాఖలుచేసింది. ఇందులో లాలూ ప్రసాద్, మరో 77 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నో… తేజ్ ప్రతాప్, హేమయాదవ్ తదితరులకు బెయిలు మంజూరు చేస్తూ, తదుపరి విచారణను మార్చ 20వ తేదీకి వాయిదా వేశారు.

ఈ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 మధ్య కాలానికి సంబంధించినది. ఆయన హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే గ్రూప్ డీ పోస్టుల్లో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిగా లాలూ కుటుంబ సభ్యులు, ఇతర అనుచరుల పేరిట భూములను రిజిస్టర్ చేయించున్నారని సమాచారం. ఈ కేసులో క్రిమినల్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు లాలూ కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించాయి.

Also Read : Chennai High Court: తమిళం రాయడం, చదవడం వచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగం – హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!