Lalu Prasad Yadav: ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ! ‘టైగర్ జిందా హై’ అంటూ హోర్డింగులు !
ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ! ‘టైగర్ జిందా హై’ అంటూ హోర్డింగులు !
Lalu Prasad Yadav : ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్(Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ సమయంలో వందలాందిమంది ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు లాలూ విచారణకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
Lalu Prasad Yadav ED Case
ఇదిలావుంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) భార్య రబ్రీదేవి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ కలకలం సృష్టిస్తోంది. ఇది ఈడీ అధికారులను ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. ఈ హోర్టింగ్‌పై ‘టైగర్ జిందా హై’(టైగర్ బతికేవుంది) అని రాసివుంది. అలాగే ‘నా ఝుకాహూ, నా ఝుకూంగా’ (తగ్గేదే లే) అని ఉంది. ఈ హోర్డింగ్‌లో ఒకవైపు లాలూ యాదవ్ ఫొటో ఉంది. మరోవైపు ఒక వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి కొందరు లాగుతున్నట్లు ఫొటోవుంది. ఆ ఫొటోలో వ్యక్తి లాలూ అని, అతనిని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు పీఎంఓ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తాళ్లతో లాగుతున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. లాలూ యాదవ్‌కు సంబంధించిన ఈ పోస్టర్ ను ఆర్జేడీ నేతలు నిషాంత్ మండల్, రాజూ కోహ్లీ రూపొందించారు. ఈ హోర్డింగ్‌లో బీజేపీ దిగ్గజ నేతలను పోలిన చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాలూ యాదవ్ ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈ విచారణను ఎదుర్కొంటున్నారు.
‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 మధ్య కాలానికి సంబంధించినది. ఆయన హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే గ్రూప్ డీ పోస్టుల్లో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలున్నాయి. అందుకు ప్రతిగా లాలూ కుటుంబ సభ్యులు, ఇతర అనుచరుల పేరిట భూములను రిజిస్టర్ చేయించున్నారని సమాచారం. ఈ కేసులో క్రిమినల్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు లాలూ కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించాయి.
Also Read : Marri Rajasekhar: వైసీపీకు బిగ్ షాక్ ! ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా !