KTR: మాజీ మంత్రి కేటీఆర్‌ పై రెండు కేసులు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్‌ పై రెండు కేసులు నమోదు

KTR : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెండు కేసు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్‌ పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్‌ పోలీసులు కేటీఆర్‌ పై ఈ కేసులు నమోదు చేసారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌, మాస్‌ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్(KTR) ట్వీట్ చేశారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ చౌగోని రజిత ఆరోపించారు. కేటీఆర్ ట్వీట్ ను ఉపయోగించి… బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రజిత… కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

KTR Got Two Cases

దీనితో మున్సిపల్ మాజీ చైర్‌ పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌తో పాటు సోషల్‌ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌ కుమార్‌‌ లపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసారు. ఈ వ్యవహారంలో ఏ1గా మన్నే క్రిశాంక్‌, ఏ2గా కేటీఆర్‌, ఏ3గా దిలీప్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఉగ్గడి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఇది ఇలా ఉండగా పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఒక మైనర్‌ బాలికతో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Also Read : SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుండి ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌ మృతదేహం వెలికితీత

Leave A Reply

Your Email Id will not be published!