Indian Air Force :అమెరికా నుండి తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లు
అమెరికా నుండి తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లు
Indian Air Force : తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకే-1ఏ(MK-1A)లో ఎంతో కీలకమైన ఎఫ్-404 ఇంజన్ల సరఫరాకు మార్గం సుగమమం అయింది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ నుంచి మొత్తం 12 ఇంజిన్లు డెలివరీ కానున్నాయి. రెండేళ్ల ఆలస్యం తర్వాత అవి ఈనెల భారత్‌కు రానున్నాయి. ఈ యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఎఫ్-404 ఇంజన్లలో మొదటి దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు పంపినట్టు అమెరికా రక్షణ రంగ కంపెనీ జీఈ ఏరోస్పేస్ వెల్లడించింది.
Indian Air Force New Upgrations
భారతీయ వాయుసేన (ఐఏఎఫ్(Indian Air Force)) కోసం 88 తేజస్ మార్క్-1ఏ ఎయిర్‌క్రాఫ్ట్ లు కొనుగోలుకు 2021 ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ… హాల్ తో రూ.48వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. గతేడాది మార్చిలోనే హాల్ వాటిని ఐఏఎఫ్ కు అందించాల్సి ఉంది. కానీ… ఇంతవరకు ఒక్క విమానాన్ని కూడా డెలివరీ చేయలేదు. ఈ యుద్ధవిమానాల కోసం 99 ఇంజన్లు కావాలని జీఈ ఏరోస్పేస్ కు హాల్ 2021లోనే ఆర్డర్ ఇచ్చింది. ఏటా కొన్ని చొప్పున అందించేలా ఒప్పందం కుదిరింది. కానీ, జీఈ ఏరోస్పేస్ ఇప్పటి వరకూ ఒక్క ఇంజన్‌ను కూడా అందించలేదు. దీనితో హాల్ కూడా ఐఏఎఫ్ కు తేజస్ లు డెలివరీ చేయలేకపోయింది.
ఇటీవలే ఈ ఇంజన్ల తయారీని ప్రారంభించిన జీఈ ఏరోస్పేస్… మసాచుసెట్స్ సమీపంలోని లిన్ లో ఉన్న తయారీ కేంద్రం నుంచి తొలి ఇంజన్‌ను హాల్ కు పంపినట్టు తెలిపింది. అది వచ్చే నెల ప్రారంభంలో అది భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. ఐఏఎఫ్(Indian Air Force) అవసరాలకు అనుగుణంగా యుద్ధ విమానాలు అందించడానికి జీఈ ఏరోస్పేస్, హాల్ కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎఫ్-404 ఇంజన్ల సరఫరా ప్రారంభం కావడంతో హాల్ కూడా ఐఏఎఫ్ కు తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలు అందించేందుకు మార్గం సుగమమైందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ఏటీఏజీఎస్), హై మొబిలిటీ గన్ టోవింగ్ వాహనాల కొనుగోలు నిమిత్తం భారత్ ఫోర్జ్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌లతో రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం రూ.6,900 కోట్లకు కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
తేజస్ మార్క్ 1-A యుద్ధ విమానాల్లో F-404 ఇంజిన్లు అత్యంత కీలకం. అయితే డెలివరీ జాప్యంతో హాల్ (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో తేజస్ యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ నెమ్మదించింది. పాకిస్థాన్, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు, అలాగే డ్రాగన్ అత్యాధునిక ఫైటర్ జెట్లను రూపొందించి పాక్‌కు అందిస్తుంటే… మనం ఇంజిన్ల కోసం వేచిచూడాల్సి రావడం ఆందోళనకు దారితీసింది.
ఇదిలాఉంటే.. 98 కేఎన్ థ్రస్ట్ (కిలోన్యూటన్ల శక్తి) కలిగిన F-414 ఇంజిన్‌నూ అమెరికా నుంచి సమకూర్చుకోవాలని భారత్ తలపెట్టింది. మార్క్ 2లో వాటిని అమర్చాలని యోచిస్తున్నారు. అయితే వీటి సరఫరా కూడా ఇంకా మొదలుకాలేదు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ప్రపంచంలో సొంతంగా ఫైటర్ ఇంజిన్ ను తయారుచేసే సత్తా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకే ఉంది. ఆ సామర్థ్యాన్ని సాధించేందుకు భారత్ 1984లోనే కావేరి ఇంజిన్ ప్రాజెక్టు చేపట్టింది. అణ్వస్త్ర పరీక్షల వల్ల అంతర్జాతీయ ఆంక్షలకు గురవడంతో ఈ ప్రాజెక్టు దెబ్బతింది. అయితే, 2016లో ఫ్రెంచి కంపెనీ శాఫ్రాన్ సహకారంతో 110 కేఎన్ శక్తి గల ఇంజిన్‌ను తయారీని తలపెట్టింది.
Also Read : Sonia Gandhi: మాతృ వందన యోజనకు నిధులేవీ – సోనియా గాంధీ